మళ్లీ యాక్షన్‌ గాళ్‌గానే ఎంట్రీ ఇస్తోంది 'గురూ'

By iQlikMovies - May 03, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

'సాలాఖడస్‌' చిత్రంతో తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా సుపరిచితురాలైంది ముద్దుగుమ్మ రితికా సింగ్‌. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'గురు' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయం అందుకుంది. వెంకటేష్‌ హీరోగా నటించాడు ఈ సినిమాలో. 

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళంలో మాత్రం నటించింది. తమిళంలో లారెన్స్‌తో రితికా సింగ్‌ నటించిన 'శివలింగ' చిత్రం తెలుగులోనూ డబ్‌ అయ్యింది. తొలి సినిమాలో కాస్త బొద్దుగా స్ట్రాంగ్‌గా కనిపించిన ఈ బ్యూటీ 'శివలింగ' సినిమాలో కొంచెం నాజూగ్గా కనిపించింది. లారెన్స్‌తో పోటీ పడి డాన్సులు ఇరగదీసేసింది కూడా. ఈ బ్యూటీ రియల్‌గానే బాక్సర్‌ కావడంతో ఫిజిక్‌ విషయంలో ఫిట్‌నెస్‌ పాఠించింది. అయితే ఇప్పుడు మరింత సన్నగా మారిన తన ప్యాక్‌డ్‌ బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేసింది. 

ఈ లుక్‌ ఎందుకోసమో తెలుసా? ఈ బ్యూటీ త్వరలోనే మరో తెలుగు సినిమాలో నటించబోతోందట. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఆ చిత్రానికి కథనందించారట. ఆయన సమర్పణలోనే ఈ చిత్రం రూపొందనుందట. ఇది కూడా స్పోర్ట్స్‌ నేపథ్యంలోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఆ సినిమా కోసమే తన శరీరాన్ని ఇలా ట్రాన్స్‌ఫర్‌ చేసుకుందట ఈ బ్యూటీ. 

వాట్‌ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కదా. దటీజ్‌ రితికా సింగ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS