అందాల అదితి హాట్‌ ఫోటో వెనుక స్టోరీ

By iQlikMovies - May 02, 2018 - 18:46 PM IST

మరిన్ని వార్తలు

మారుతున్న టెక్నాలజీ ప్రభావంతో ఫోటోగ్రఫీలో ఎన్ని రకాల మార్పులొచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏకంగా మొబైల్‌ కెమెరాతో సినిమాలే తీసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫోటో కూడా అందుకు చక్కని నిదర్శనంగా చెప్పొచ్చు. ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ అదితీ రావ్‌ హైదరీ. 

అదేనండీ మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కొత్త సినిమాలో నటిస్తోన్న ముద్దుగుమ్మ. సుధీర్‌బాబుతో నటించిన 'సమ్మోహనం' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఈ ఫోటోని పోస్ట్‌ చేస్తూ ఈ ఫోటో వెనక పెద్ద స్టోరీ ఉందని చెప్పుకొచ్చింది. ఆ స్టోరీ ఏంటో మీరూ వినాలనుకుంటున్నారా? అయితే వినండి. ఈ ఫోటోని ఓ ప్రొఫిషనల్‌ కెమెరా మేన్‌ తీశాడట. ఆయన పేరు ఎరికోస్‌ ఆండ్రూ. అయితే ప్రొఫెసనల్స్‌ దగ్గర సహజంగానే కాస్ట్‌లీ కెమెరాస్‌ ఉంటాయన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈయన తీసిన ఈ ఫోటో మాత్రం ఓ సాధారణ మొబైల్‌ కెమెరాతో తీసిందట. కెమెరాలకు ఉపయోగించే లెన్స్‌, లైటింగ్స్‌ ఏవీ ఈ ఫోటో కోసం ఆయన ఉపయోగించనే లేదట. అలాగే ఎలాంటి ఎఫెక్ట్స్‌ లేకుండా ఈ ఫోటోని క్లిక్‌మనిపించేశాడట ఎరికోస్‌. అయినా కానీ ఈ ఫోటో ఎంత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుందో చూశారుగా. అది ఎరికోస్‌ స్పెషాలిటీ. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. 

ఇక ఈ ఫోటోలో కుర్చీలో కూర్చొని అదితి పండిస్తున్న గ్లామర్‌ కెవ్వుకేక. కుర్రోళ్ల మతులు ఈజీగా పోగొట్టేస్తోంది తన హాట్‌నెస్‌తో ఈ ముద్దుగుమ్మ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS