'గురు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రితికా సింగ్, లేటెస్ట్గా 'శివలింగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'గురు' సినిమాలో చాలా రఫ్ క్యారెక్టర్. టామ్ బాయ్ తరహా పాత్రలో నటించిన మెప్పించిన ఈ బ్యూటీ, గ్లామరస్‌గా ఏం చేస్తుందోనని అంతా అనుకున్నారు. అయితే ఎవరి అంచనాలకీ అందని రీతిలో 'శివలింగ' సినిమాతో సత్తా చాటింది. ఈ సినిమాలో రితికా సింగ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే ఆమె గ్లామర్ గురించీ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అంతే కాదు డాన్సుల్లో లారెన్స్‌తోనే రితికా సింగ్ పోటీ పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. డాన్సులు రావు రావంటూనే, ఇరగదీసేసింది. నాతో సమానంగా చేసింది అంటూనే, నాకన్నా బాగా చేసిందని లారెన్స్ చెప్పినప్పుడే రితికా సింగ్‌లో డాన్సింగ్ టాలెంట్‌పై ఓ అంచనాకి వచ్చేశారు. ఆ అంచనాల్ని మించి మన్ననలు అందుకుంటోంది. డాన్సులు, నటన, గ్లామర్ ఇలా అన్నిట్లోనూ రాణిస్తున్న రితికా సింగ్ ముందు ముందు తెలుగు తెరపై పెద్ద హీరోయిన్ అయిపోతుందేమో. లక్ ఎవరికి ఎలా కలిసొస్తుందో ఎలా చెప్పగలం? 'గురు' సినిమాలో రితికా సింగ్‌ని చూసినవారు, అసలీమె హీరోయిన్ మెటీరియల్ కాదనుకున్నారు. ఆమె నుంచి గ్లామరస్ పాత్రలు అసలు ఎవరూ ఆశించనే లేదు. డాన్సులూ అంతే. కానీ ఆమె వాటిని సీరియస్‌గా తీసుకుంది. హీరోయిన్గా రాణించాలంటే అన్నిట్లోనూ సత్తా చాటాలి. రితికా సింగ్ అదే చేసిందిప్పుడు.