తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కష్టమే. సక్సెస్ వచ్చినా, తెలుగులో సరైన ఛాన్స్‌లు రాకపోవడంతో చెన్నయ్ చెక్కేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసు కదా? 'పెళ్ళిచూపులు' పేం రీతూ వర్మ, తమిళ సినిమాల్లో మంచి మంచి ఛాన్స్‌లు కొట్టేస్తోంది. విక్రమ్ సరసన ఓ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రీతూ వర్మ, బీచ్‌లో ఇదిగో ఇలా పోజులు ఇస్తూ స్టైల్ ఐకాన్ అన్పించేసుకుంది. గ్లామర్‌కి గ్లామర్ పెర్ఫామెన్స్‌కి పెర్ఫామెన్స్ అన్నీ ఉన్నా, టాలీవుడ్‌కి 'లోకల్' ఫీలింగ్ కారణంగా ఈమె నచ్చడంలేదనుకోవాలేమో. అదే ముంబై బ్యూటీస్ అయితే యాక్టింగ్ రాకపోయినా మనోళ్ళకి తెగ నచ్చేస్తారు. చక్కగా తెలుగులో మాట్లాడటం, తెలుగుదనం ఇవన్నీ తెలుగు సినిమాకి తెలగమ్మాయిల్ని దూరం చేసేస్తుండడం శోచనీయం. పరభాషా నటీమణులు తెలుగు నేర్చుకుంటే చాలు ముద్దుముద్దుగా మనం ఫీలయిపోతున్నాం. స్టైలింగ్‌లో ముంబై బ్యూటీస్‌కి ఏమాత్రం తీసిపోని ఈ లోకల్ సొగసుని టాలీవుడ్ కాస్తంత పట్టించుకుంటే బాగుంటుందేమో!