'పెళ్ళి చూపులు' సినిమాతో మంచి గుర్తింపే సాధించిన హీరోయిన్ రీతూ వర్మ ఎందుకో తెలుగులో ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు దక్కలేదు. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలతో స్టార్ గా ఎదిగినప్పటికీ రీతూ వర్మ మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దీంతో రీతు తమిళ, మలయాళ సినిమాలపై కూడా దృష్టి సారించింది. అయితే ఈ మధ్య మాత్రం రీతూవర్మ కు జోరుగా తెలుగు సినిమాల ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.
తాజాగా రితు వర్మకు 'కార్తికేయ 2' లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని సమాచారం. నిఖిల్ - చందు మొండేటి కాంబినేషన్లో సూపర్ హిట్ గా నిలిచిన 'కార్తికేయ' చిత్రానికి ఇది సీక్వెల్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో రీతు చేతిలో మూడు తెలుగు సినిమాల ఆఫర్లు ఉన్నట్టే. 'కార్తికేయ 2' కలిపితే రీతుకి ఇప్పుడు మొత్తం నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి.
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక ద్విభాషా చిత్రంలో రీతు హీరోయిన్ గా నటిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీష్' సినిమాలో కూడా రీతు హీరోయిన్. 'చైనా' అనే మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక విక్రమ్ తో నటించిన 'ధృవ నక్షత్రం' రిలీజ్ కాకుండా ఆగిపోయింది.