తెలుగులో దూకుడు పెంచిన తెలుగమ్మాయ్‌.!

By Inkmantra - February 13, 2020 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై సంచలన విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ రీతూ వర్మ. అంతకు ముందు హీరోయిన్స్‌కి చెల్లెలు, ఫ్రెండ్స్‌ పాత్రల్లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌ అయ్యాక, సెలెక్టివ్‌గా మూవీస్‌ చేస్తూ, కెరీర్‌ని నెమ్మదిగా బిల్డప్ చేసుకుంటోంది. నిఖిల్‌తో ఈ భామ నటించిన ‘కేశవ’ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రీతూ వర్మ, ఈ లోగా తమిళంలో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ స్టార్‌ హీరో విక్రమ్‌ సరసన ‘ధృవ నక్షత్రం’ సినిమాలో నటించింది. అయితే, ఆ సినిమా స్టేటస్‌ ఏంటో ప్రస్తుతానికి తెలీదు కానీ, మళ్లీ టాలీవుడ్‌లో దూకుడు పెంచింది.

 

ఎట్‌ ఏ టైమ్‌ రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టేసింది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘టక్‌ జగదీష్‌’లో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్‌ అయిన ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, లేటెస్ట్‌గా మరో యంగ్‌ హీరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. ఆయన మరెవరో కాదు, ‘అశ్వథ్థామ’గా ప్రేక్షకుల్ని మెప్పించిన నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. ఫిబ్రవరి 19 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS