రష్మిక కొత్త స్ట్రేటజీ అదిరింది బాస్‌!

మరిన్ని వార్తలు

కన్నడ బ్యూటీ రష్మికా మండన్నాకి మొదట్నుంచీ డిఫరెంట్‌ క్రేజ్‌ ఉంది. తొలి సినిమాకే ఆ క్రేజ్‌ బాగా యూజ్‌ అయ్యి, సినిమా హిట్‌ కూడా తోడవడంతో, ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో, మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా స్టార్‌డమ్‌ కొట్టేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరూ రష్మిక వైపే చూస్తున్నారంటే ఆమె ఇమేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెరీ లేటెస్ట్‌గా ‘సరిలేరు..’తో హిట్‌ కొట్టి హీరోయిన్స్‌లో సరిలేరు నాకెవ్వరూ.. అనిపించేసుకుంది.

 

ఇక ఇప్పుడు ‘భీష్మ’ సినిమాతో ఈ నె 21న ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ సినిమాలో నితిన్‌తో రష్మిక ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీకి ఎప్పటి నుండో ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఆన్‌ స్క్రీనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌ కూడా హైపర్‌ యాక్టివ్‌గా ఉండే రష్మిక, ప్రమోషన్స్‌లో అయితే, మరింత యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. తాజాగా ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో రష్మిక సరికొత్త స్ట్రాటజీ చూపించబోతోందట. అదేంటంటారా? గ్లామర్‌ అప్పీల్‌. ‘భీష్మ’ ప్రమోషన్స్‌ కోసం రష్మిక తనలోని హాట్‌ యాంగిల్స్‌ని బయటికి తీయనుందట.

 

పొట్టి పొట్టి దుస్తుల్లో, హాట్‌ హాట్‌గా కుర్రకారును కవ్వించనుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రిలీజైన కొన్ని ప్రమోషన్‌ పోస్టర్స్‌లో ఆ యాంగిల్‌ జస్ట్‌ శాంపిల్‌గా వదిలిన రష్మిక, ముందు ముందు విజృంభించేయనుందట. గ్లామర్‌కి దూరంగా ఉంటేనే రష్మిక ఫాలోవర్స్‌ని పట్టుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. ఇక గ్లామర్‌ తెరు తెరిస్తే అబ్బో.. తట్టుకోవడం మరింత కష్టమే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS