'మజ్ఞు' సినిమాలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ సోదరిగా కన్పించిన ప్రియా శ్రీ ఇప్పుడు రియా సుమన్‌గా పేరు మార్చుకుంది. అసలు పేరు రియా సుమన్ అయినా, 'మజ్ఞు' సినిమా కోసం ప్రియా శ్రీగా మారాననీ, ఇప్పుడు రియా సుమన్ అయ్యానని చెబుతున్న ఈ బ్యూటీ, లేటెస్ట్గా 'పేపర్‌బాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవ్వితే ముత్యాలు రాలతాయ్.. అని నవ్వులోని అందాన్ని అభివర్ణిస్తుంటాం. నిజమే, ఈ బ్యూటీ నవ్వితే ముత్యాలు రాలతాయేమో. ఎందుకంటే ఆమె ధరించిన కాస్ట్యూమ్‌లో జాకెట్ (టాప్) అచ్చంగా ముత్యాలతో డిజైన్ చేసినట్లుంది మరి. అందానికి అందమే కాదు, నటనలోనూ మేటి అయిన రియా సుమన్‌కి ఒక్క సక్సెస్ అయితే చాలు, హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకోగలదు. ఆ హిట్ ఈ బ్యూటీకి 'పేపర్ బాయ్' సినిమాతో దక్కుతుందా? వేచి చూడాలిక.
ALSO SEE :
Qlik Here For The Gallery of Riya Suman