ప్రముఖ నటి, లోక్ సభ సభ్యురాలు అయిన హేమామాలిని ఇంట్లో దొంగలు పడిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అందుతున్న వివరాల ప్రకారం, హేమామాలిని తన షూటింగ్ సమయంలో వాడే వస్తువులని ప్రత్యేకంగా ముంబైలోని ఒక బిల్డింగ్ లో పెట్టడం అలవాటు. అయితే ఆ బిల్డింగ్ లో ఎవరో దొంగలు పడి ఆ షూటింగ్ సామాన్లని ఎత్తుకెళ్ళిపోయారు.
ఆ దొంగతనం జరిగిన రోజు నుండి ఆ బిల్డింగ్ కాపలాదారు కనపడకపోవడంతో అతని పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దొంగతనం జరిగి సుమారు ఆరు రోజులు క్రితం జరిగిందని అయితే ఈరోజే మీడియాకి తెలిసినట్టు సమాచారం.
ఇక హేమామాలిని ఈ దొంగతనం పై ఫిర్యాదు చేయగా పొలిసు అధికారులు విచారణ ప్రారంభించారు.