తమిళనాట GST కారణంగా పెరగనున్న సినిమా ధియేటర్ టికెట్ల ధరలు వాటి వల్ల ఏర్పడే నష్టాలని అంచనా వేసేందుకు మదురైలో ధియేటర్ల సంఘం నిన్న సమావేశమైంది.
ఇందులో వారు తీసుకున్న ప్రధాన నిర్ణయమేమిటంటే- రాష్ట్ర ప్రభుత్వం విదించే పన్నుని పూర్తిగా ఎత్తివేయాలని అల చేస్తే తప్ప ఇప్పుడు తలెత్తనున్న ప్రభావం తగ్గదని వారు నిర్ణయానికి వచ్చారు. ఒక వేళ ఇది ఒప్పుకొని పక్షంలో తాము దీపావళి నుండి నిరవధికంగా ధియేటర్లు మూసేస్తామని హెచ్చరిక జారిచేశారు.
దీనితో దీపావళి కి విడుదల కానున్న విజయ్ మెర్సల్ చిత్ర భవిష్యత్తు ప్రశ్నగా మారిపోయింది. దీపావళి ని నమ్ముకుని చాలా చిత్రాలు విడుదలు సిద్ధమవుతుండగా ఈ కొత్త నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తున్నది.
మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవ్వనుందో వేచి చూడాలి.