'రోబో' మేనియా 'పెట్టా' అదిరిందయా.!

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఈ మధ్య వరుస అపజయాలు ఎదురయిన సంగతి తెలిసిందే. 'కబాలి', 'కాలా'.. ఇలా వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న సూపర్‌స్టార్‌ని 'రోబో 2.0' ఒక్కసారిగా పైకి లేపింది. భారీ అంచనాలతో రూపొందిన 'రోబో 2.0' సూపర్‌స్టార్‌ స్టామినాని తిరిగి తీసుకొచ్చేలా చేసింది. ఈ జోష్‌తో ఆయన తదుపరి చిత్రం 'పేట్టా'పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతవరకూ ఈ సినిమాని పట్టించుకోలేదు.

లేటెస్టుగా ఈ సినిమా నుండి ఆడియోసింగిల్‌ని వదిలారు. 'మరానా మాస్‌..' అనే ఈ ఊరమాస్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ఊపు ఊపేస్తోంది. తమిళ వెర్షన్‌ సాంగ్‌కే ఇంత రెస్పాన్స్‌ వస్తోంది. ఇక తెలుగు వెర్షన్‌ అయితే ఎలా ఉంటుందో. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్యర్స్‌ బ్యానర్‌లోఈ సినిమా తెరకెక్కుతోంది. అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. సీనియర్‌ నటి సిమ్రాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

గతంలో విడుదల చేసిన రజనీకాంత్‌ - సిమ్రాన్‌ జోడీ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంత వయసులోనూ రజనీలోని ఎనర్జీకి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఇక 'రోబో'లో ఆయన ఎనర్జీని చూసిన అభిమానులు వన్‌ ఆండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన విజువల్‌ వండర్‌ '2.0' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల జల్లు కురిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS