రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినా ఒకే వేదికపై ప్రొఫిషనల్‌గా కలవడం జరుగుతోంది నాగబాబు, రోజా. రాజకీయ పార్టీల పరంగా ప్రత్యర్ధులైన ఈ ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని హాయిగా, ఆహ్లాదంగా నవ్వుకుంటుంటారు. ఆ వేదికే 'జబర్దస్త్'.
వేర్వేరు నియోజకవర్గాల నుండి, రెండు బలమైన పార్టీల తరపున ఈ ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు రాజకీయంగా. అసలు మ్యాటరేంటంటే, తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా ఈ సారి ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులపై అంతగా విమర్శలు చేయడం లేదు. ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో రోజా, చిరంజీవిని ఓ రేంజ్‌లో విమర్శించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత తరుణంలో మాత్రం చాలా సంయమనం పాఠిస్తున్నారెందుకో. ఈ సంగతిటుంచితే, ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ, ఎమ్యెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరించారిన్నాళ్లూ రోజా. ఇప్పుడు ఎంపీగా నాగబాబు గెలిస్తే, అదే పరిస్థితి. ఎంపీ అయినా 'జబర్దస్త్' వదిలేది లేదని నాగబాబు ఖచ్చితంగా చెబుతున్నారు.
రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహిస్తూనే బుల్లితెరపై ఈ ఇద్దరూ ప్రొఫిషనల్‌గానూ కొనసాగనున్నారన్న మాట. అవును.. రాజకీయం రాజకీయమే. ప్రొఫిషన్ ప్రొఫిషనే అనేది వీరిద్దరి అభిప్రాయం. అంటే జబర్దస్త్ షోలో ఇకపై ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే (గెలిస్తే) జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారన్న మాట.