రోల్ రైడా- తన ర్యాప్ తో అందరిని అలరించే ఈ తొలి తెలుగు ర్యాపర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో హల్చల్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో టాప్ 5 గా నిలిచే ఇంటి సభ్యులలో కచ్చితంగా రోల్ రైడా ఉండబోతున్నాడు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
ఇక వివరాల్లోకి వెళితే, నిన్న ఇంటిలో “హలో హలో” లో రోల్ రైడా కి తన చెల్లెలు ఫోన్ చేసి మాట్లాడింది. అందులో రోల్ రైడా తాజాగా రూపొందించిన ఒక పాట ఎప్పుడు విడుదల అవ్వనుంది అన్న దాని పైన రోల్ చెల్లెలు క్లారిటీ ఇచ్చింది.
ఇంతకి ఆ పాటకి పేరు ఏమి పెట్టారు అని రోల్ అడగగా- అరుపు అని సమాధానం వచ్చింది. దీనితో ఈ “అరుపు” అని విడుదల కాబోయే పాటకి ఇప్పుడు మంచి పబ్లిసిటీ వచ్చేసింది అని చెప్పొచ్చు. త్వరలోనే అందరి నోట ఇక ఈ “అరుపు” గురించిన అరుపులు వినిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఈ పాట ఆగష్టు మొదటి లేదా రెండవ వారంలో విడుదలకానుందట.