బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ ఎంట్రీ తో మొదలై ఆ తరువాత “హలో.. హలో” అంటూ తమ ఇంటి సభ్యుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ తో ఇంటి సభ్యులందరూ ఎమోషనల్ గా మారిపోయారు.
ఇక ముఖ్యంగా కౌశల్ తన భార్య, పిల్లలతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకోవడం అందరిని కదిలించేసింది. తన పిల్లలు మాట్లాడినప్పుడు అదే సమయంలో బయట చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు నీకు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఆటని ఆడు అని చెప్పడంతో చాలా ఎమోషనల్ అయిపోయాడు.
ఒకరకంగా తన భార్య ఫోన్ లో చెప్పిందంతా విన్నాక తన ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందనే చెప్పొచ్చు. ఇదే సమయంలో తాను ఇప్పటివరకు అనుసరిస్తున్న గేమ్ ప్లాన్ నే కొనసాగించమని చెప్పేసరికి కౌశల్ కి ఇప్పటికిప్పుడు హౌస్ లో ఎదురు ఉండదు అని అనుకోవచ్చు.
మరి ఈ ఫోన్ కాల్ ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.