సరసాలు చాలు శ్రీవారు వేళ కాదూ.. వంటింట్లో మురిపాలు వీలు కాదు.. అంటూ అప్పుడెప్పుడో నాగార్జున, అమల ఓ రొమాంటిక్ సాంగేసుకున్నారు ఇలాగే కిచెన్‌లో. అయితే, ఈ ముద్దుగుమ్మ సోలోగానే వంటింట్లో వయ్యారాలు పోతోంది. లైట్ కలర్ ట్రాక్ నిక్కర్‌లో బ్రైట్‌గా విరుపులు చూపిస్తోంది. ఇంతకీ ఈ పాపను గుర్తుపట్టారా.? పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. పేరు కేతికా శర్మ.
తెర పరిచయానికి ముందే ఈ పాప తెగ వయ్యారాలు పోతోంది తనకు బాగా అలవాటైన సోషల్ మీడియా తెరపైన. ఆల్రెడీ ఈ భామకు అక్కడ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అసలు చెప్పాలంటే, అక్కడి నుండే ఈ పాప అంత పాపులర్ అయ్యింది మరి. ఎప్పటికప్పుడే జిమ్‌లో కసరత్తులు చేస్తూ దిగిన హాట్ హాట్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ, తన అందాలను కుర్రాళ్లకు వలగా విసురుతుంటుంది. సోషల్ తెరపై ఫాలోయింగ్ బాగానే ఉంది మరి. అసలు తెరపై అమ్మడి టాలెంట్ ఎలా ఉంటుందో సినిమా విడుదలైతే కానీ తెలీదు.