గ్లామ్‌ షాట్‌: కేతిక.. 'రొమాంటిక్‌'గా కెవ్వు కేక!

మరిన్ని వార్తలు

పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాణంలో అనిల్‌ పాడూరి దర్శకత్వంలో పూరి ఆకాష్‌ హీరోగా నటిస్తోన్న 'రొమాంటిక్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది కేతిక శర్మ. కాస్త బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ కాస్త బక్క పలచగా వుండే పూరి ఆకాష్‌ సరసన ఎలా అలరించబోతోందోగానీ, ఈ అమ్మడి బొద్దు బొద్దు సొగసులు మాత్రం సోషల్‌ మీడియాలో కుర్రకారుకి కిర్రాకు పుట్టించేస్తున్నాయి. సూపర్బ్‌ డాన్సర్‌ కూడా అయిన కేతిక, సోషల్‌ మీడియాలో సూపర్బ్‌ సెలబ్రిటీ స్టేటస్‌ దక్కించేసుకుంది తన అందచందాలతో.

 

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. బికినీకి కాస్త ఎక్కువ.. అన్నట్లున్న ఈ డ్రెస్సింగ్‌ స్టయిల్‌లో కేతిక సొగసుల్ని వర్ణించడం సాధ్యమా? అందాల విందు సంగతి పక్కన పెడితే, తనదైన నటనతో తొలి తెలుగు సినిమాతోనే సత్తా చాటుతానంటోంది ఈ బొద్దుగుమ్మ. పూరి లాంటి గొప్ప దర్శకుడి నిర్మాణంలో తెరంగేట్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుందనీ, రొమాంటిక్‌గా తెలుగు ప్రేక్షకుల్ని తన వలలో పడేసుకుంటానని చెబుతోంది కేతిక. మాటలతో చెప్పాలా? చూపులతో, అంద చందాలతో ఆ విషయం ఇలా ఈ ఫొటోల్లో చెప్పకనే చెప్పేస్తున్నావ్‌ కదా కేతికా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS