'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి ఇటు తెలుగులోనూ, తమిళంలోనూ మంచి ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగులో యూత్‌స్టార్ శర్వానంద్‌తో 'పడి పడి లేచె మనసు' సినిమాలో నటిస్తూనే, తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న 'మారి 2' సినిమాలో నటిస్తోంది. 'పడి పడి లేచె మనసు' సినిమా నుండి మొన్న విడుదలైన ఆడియో సింగిల్‌లో ఆల్రెడీ సాయి పల్లవి డాన్సింగ్ మూమెంట్స్ చూసేశాం. వహ్వా..!! అని పొగిడేశాం. ఇప్పుడు మాస్ హీరో ధనుష్ సరసన సాయి పల్లవి వేసిన మాస్ ఊరమాస్ స్టెప్పులు గురించి మాట్లాడుకుంటున్నాం.
'మారి 2' నుండి లేటెస్టుగా ఓ ఆడియో సింగిల్‌ని వదిలారు. 'రౌడీ బేబీ..' అంటూ సాగే ఈ ఆడియో సింగిల్‌లో సాయి పల్లవి స్టెప్పులు అదరగొట్టేస్తున్నాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌లో రూపొందిన ఈ మాస్ బీట్ సాంగ్‌కి సాయి పల్లవి, ధనుష్ జోడీ మాస్ స్టెప్పులకు తమిళ తంబీలు తెగ సంబరపడిపోతున్నారు. ధనుష్ మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఇక సాయిపల్లవి డాన్సుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వర్ణించడమే కష్టం. ఇన్నాళ్లకు సాయిపల్లవికి, డాన్సుల్లో పర్ఫెక్ట్ జోడీ దొరికినట్లైంది.
ఈ ఆడియో సింగిల్ వీడియో పుటేజ్ రాలేదు కానీ, విడుదలైన ఒకటీ అరా స్టిల్స్‌కే మైండ్ బ్లోయింగ్ అనిపించేస్తోంది. గతంలో కాజల్ - ధనుష్ జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మారి'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది 'మారి 2'. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే, సాయి పల్లవి, సూర్యతో నటిస్తున్న 'ఎన్జీకే' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్ ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తోంది.