రష్మికాకి మెగా ఆఫర్‌: అంతా ఉత్తదే అంటున్న ఫాన్స్.!

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ హీరోయిన్‌ రష్మికా మండన్నా తెలుగులో 'ఛలో' సినిమాతో తెరంగేట్రం చేసి సూపర్‌ హిట్‌ కొట్టి, విజయ్‌ దేవరకొండతో 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుని మోస్ట్‌ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. అతి తక్కువ టైంలో ఇంత పాపులారటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి తమిళంలో డెబ్యూ మూవీకే స్టార్‌ హీరో విజయ్‌తో నటించే అవకాశం దక్కించుకుందంటూ ప్రచారం జరిగింది. విజయ్‌ కొత్త సినిమాలో హీరోయిన్‌గా రష్మికాని ఎంచుకున్నారనీ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ బ్యూటీకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ కూడా చెప్పేశారు. అయితే వారి వెల్‌కమ్‌ని సున్నితంగా తిరస్కరించింది రష్మికా మండన్నా. ఎందుకంటే ఈ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదనీ నాపై అంచనాలు పెంచేయకండ్రా బాబూ అంటూ ఈ ముద్దుగుమ్మ మొదట్లోనే తేల్చేసింది. అయినా ఈ ప్రచారాలకు బ్రేక్‌ పడకపోవడంతో తాజాగా మరోసారి రష్మికా స్పందించింది.

అలాంటి అవకాశమే వస్తే, కెరీర్‌లో అదే తనకు బిగ్‌ ఆపర్చునిటీ అవుతుందనీ, ఆ అదృష్టం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాననీ, అయితే ప్రస్తుతానికి అలాంటి ఆఫర్‌ తనకు ఇంకా తగలలేదనీ రష్మికా చెప్పింది. ప్రస్తుతం రష్మికా మండన్నా 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS