ఆర్.ఆర్.ఆర్ 2డీలోనే కాదు.. 3డీలోనూ వచ్చిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఆర్.ఆర్.ఆర్‌లోని కొన్ని షాట్స్‌ని ప్రత్యేకంగా త్రీడీలో రూపొందించారు. అందుకే.. త్రీడీ వెర్షన్ లోనూ ఈ సిఇమా వచ్చింది. అయితే.. తొలి వారంలో చాలా తక్కువ థియేటర్లే అందుబాటులో ఉన్నాయి. పైగా.. 2డీ కంటే త్రీడీకి రేటు ఎక్కువ. కాబట్టి.. దానిపై ఎవ్వరికీ పెద్దగా ఫోకస్ వెళ్లలేదు.
అందుకే.. ఇప్పుడు చిత్రబృందం ఓ ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం నుంచి త్రీడీ థియేటర్లని పెంచబోతోందట. దాంతో 2డీలో చూసిన వాళ్లు, ఈ సినిమా త్రీడీలో ఎలా ఉందో చూస్తారని, దాని వల్ల రిపీటెడ్ ఆడియన్స్ వస్తారని వాళ్ల నమ్మకం. మరోవైపు.. తొలి పది రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఉంది. ఆ తరవాత తగ్గించాల్సిందే. దాంతో ఆటోమెటిగ్గా త్రీడీ సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. అలా.. ఆర్.ఆర్.ఆర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి...ఈసినిమాని మరోసారి చూద్దామనుకున్న వారికి ఇది మంచి ఛాన్స్. అలా.. రెండో వారం కూడా ఈ సినిమా వసూళ్లు స్డడీగా ఉండేలా చిత్ర బృందం మంచి ప్లానే వేసిందనుకోవాలి.