అవాతర్ ని వెనక్కి నెట్టి అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్

మరిన్ని వార్తలు

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌ లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డు గెలుచుకుంది. ‘అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్, ‘టాప్‌గన్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటి ఈ ఆర్ఆర్ఆర్ ఈ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం. గతేడాది జపాన్‌లో విడుదలైన ఆర్ఆర్ఆర్ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే

 

కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్‌ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ఉంది. వీటితో పాటు.. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఆర్ఆర్ఆర్ కు వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. అలాగే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ స్పాట్‌లైట్‌ విన్నర్‌గా ఈ చిత్రం నిలిచింది. ‘అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తా చాటింది. సన్‌సెట్‌ సర్కిల్‌ గౌరవం కూడా ఈ చిత్రానికి లభించింది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS