రాజమౌళి 'ట్రిపులార్' రికార్డుల పరంపంర మొదలైయింది. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ ని పెద్ద ఎత్తున విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలికి వచ్చిన ఆదరణ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ ని కూడా విదేశాల్లో విడుదల చేశారు. ఇప్పుడు బాహుబలికి వచ్చినట్లే ట్రిపులార్ కీ మంచి వసుళ్ళూ వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ చేసింది. అంతేకాదు 'ది బ్యాట్ మ్యాన్' సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసింది. తొలిరోజు ఆస్ట్రేలియాలో రూ 4.03 కోట్ల వసుళ్ళూ రాబట్టింది ట్రిపులార్. దీంతో 'ది బ్యాట్ మ్యాన్' తొలిరోజు రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరన్ ఆదర్స్ వెల్లడించాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అద్భుతంగా వుందని కితాబిచ్చారు ప్రేక్షకులు. సినీ ప్రముఖులు కూడా సినిమాకి నీరాజనం పడుతున్నారు. ''మీరు పక్కనే వున్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో వున్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు, మేం చూడగలం అంతే'' అని సుకుమార్ లాంటి దర్శకులు రాజమౌళి దర్శక ప్రతిభకు ముగ్ధులౌతున్నారు.