రివ్యూలు, నెగిటీవ్ టాకులు ఎలా ఉన్నా - తొలి రోజు అనుకున్నట్టుగానే `ఆర్.ఆర్.ఆర్` ప్రభంజనం సృష్టించేసింది. అన్ని ఏరియాల్లోనూ అన్ని చోట్లా.. ఆల్ టైమ్ రికార్డ్ స్థాపించేసింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా, అత్యధిక ధియేటర్లలో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అర్థరాత్రి ప్రీమియర్లతోనే ఆర్.ఆర్.ఆర్ హవా మొదలైపోయింది.
తొలిరోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.100 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక్క నైజాంలోనే 23 కోట్లు సాధించింది. ఈ క్రమంలో బాహుబలి రికార్డులన్నీ ఈసినిమా తుడిచేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు సంపాదించినట్టు టాక్. నార్త్ లో... ఈ సినిమా రూ.18 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇది కూడా ఓరికార్డే. అయితే.. శని, ఆదివారాలు ఈసినిమా ఎలా పెర్‌ఫార్మ్ చేస్తుందన్నదాన్నిబట్టి జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌లో పడాలంటే.. ఇదే జోరు వారమంతా కొనసాగాలి. మరి అలా జరుగుతుందా? లేదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.