'బాహుబలి'ని మించిపోయిన 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'

మరిన్ని వార్తలు

ఆర్‌.ఆర్‌.ఆర్‌. - ఇదేమీ సినిమా టైటిల్‌ కాదు. రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావు (ఎన్టీఆర్‌) కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా. రాజమౌళి అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తూ, ఈ సూపర్బ్‌ మల్టీస్టారర్‌ని కన్‌ఫామ్‌ చేయడంతో క్షణాల్లో ఈ విషయం వైరల్‌ అయిపోయింది. ఎంతలా? అంటే, 'బాహుబలి' సినిమా కంటే మించి సోషల్‌ మీడియాలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' హల్‌చల్‌ చేసేంతలా. సినిమా అనౌన్స్‌మెంట్‌ని కూడా ఓ ప్రోమో తరహాలో ప్రెజెంట్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌. ఇటీవలే అమెరికాలో చరణ్‌, ఎన్టీఆర్‌ 'వర్కవుట్స్‌' చేశారు. అక్కడే వారితో రాజమౌళి కలిసి, శాంపిల్‌ షూట్‌ కూడా చేశాడట.

అయితే అదంతా నిజమేనా? కాదా? అన్న అనుమానాలైతే అభిమానుల్లో కలిగాయి. దానికి కారణం, కొన్నాళ్ళ క్రితం రాజమౌళి సోషల్‌ మీడియాలో చరణ్‌, ఎన్టీఆర్‌తో కలిసి వున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా, ఆ కాంబినేషన్‌ పట్టాలెక్కుతుందో లేదో క్లారిటీ ఇవ్వకపోవడమే. చాలా టైమ్‌ తీసుకున్నాడు రాజమౌళి ఈ కాంబోపై అనౌన్స్‌మెంట్‌ చేయడానికి. 'బాహుబలి' తర్వాత నిర్మాత డీవీవీ దానయ్యతో ఓ సినిమా చేయనున్నట్లు రాజమౌళి గతంలోనే వెల్లడించాడుగానీ, అది ఓ మల్టీస్టారర్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

షడెన్‌గా రాజమౌళి ఈ సర్‌ప్రైజ్‌ ఇవ్వడం, ఆ సర్‌ప్రైజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇటు మెగా అభిమానులు, అటు నందమూరి అభిమానులు రాజమౌళిని ఇప్పుడు ఓ రేంజ్‌లో మోసేస్తున్నారు. ఆ కాంబోకి వున్న క్రేజ్‌ అలాంటిది. ఎప్పుడో చిరంజీవి - ఎన్టీఆర్‌ కలిసి నటించారు ఓ సినిమా. అది చాలా సంవత్సరాల క్రితం విషయం. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి తనయుడు, ఎన్టీఆర్‌ మనవడు ఓ సినిమాలో నటిస్తున్నారంటే ఆ కిక్కే వేరప్పా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS