తప్పలేదు.. ఎన్టీఆర్‌ లుక్‌ని అలా రివీల్‌ చేయాల్సి వచ్చింది.!

మరిన్ని వార్తలు

షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెట్స్‌లోకి ఈగ కూడా చొరబడకుండా చూసుకుంటారు. కానీ, పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు ఏ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచలేకపోతున్నారు. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌కి ఈ పెరిగిన సాంకేతికత పెద్ద ఆటంకంగానే దాపురించింది. షూటింగ్‌ సమయంలో లీకులు, సినిమా పూర్తయ్యాక, మరో లీకులు, ధియేటర్‌కి రాకముందే పైరసీ లీకులు.. ఇలా లీకుల భాగోతాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాకపోతోంది. భారీ బడ్జెట్‌ చిత్రాలకైతే, ఇది మరీ కష్ట పరిణామంగా మారింది. ఈ సమస్యను తట్టుకోలేకనే చాలా వరకూ ఓపెన్‌ లొకేషన్‌ షూటింగ్స్‌ జోలికి పోవడం లేదు మన దర్శక, నిర్మాతలు.

 

ఇకపోతే, ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ విశాఖలోని పాడేరు సమీపంలోని ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతోంది. మీడియాని కానీ, సామాన్య ప్రజానీకాన్ని కానీ ఆ ప్రదేశం వద్దకు చొరబడకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, కెమెరా కన్ను ఎలా పడిందో తెలీదు.. కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌పై షూట్‌ చేసిన కొన్ని సన్నివేశాల లీక్డ్‌ వీడియో ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. లీక్‌ అయిన కొన్ని నిముషాల్లోనే ఈ వీడియో వైరల్‌ అయిపోయింది. కొమరం భీమ్‌ పాత్రలో ట్రెడిషనల్‌ దుస్తుల్లో ఎన్టీఆర్‌ కనిపిస్తున్న వీడియో అది. లుక్‌ రివీల్‌ అయిపోవడంతో, అప్పటికప్పుడు రాజమౌళి ఏ హడావిడీ లేకుండా, ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ లుక్‌ని అధికారికంగా రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. ఏది ఏమైతేనేం, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS