కొన్ని కోట్ల కళ్ళు ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ కోసం ఎదురుచూస్తున్నాయి. తెలుగు సినిమానే అయినా, ఆ సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఇది ఇండియన్ సినిమా. అవును, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇండియన్ సినిమానే.. ఆ మాటకొస్తే, అంతకు మించి.! రాజమౌళి దర్శకత్వంలో రావ్‌ుచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్‌కి సంబంధించి టైటిల్ రివీల్ అయ్యింది. అన్ని బాషల్లోనూ ఒకటే టైటిల్.. అదే ‘ఆర్‌ఆర్‌ఆర్’. కానీ, ఆ ‘ఆర్..ఆర్..ఆర్..’కి అర్థాలు వివిధ భాషల్లో చిన్న చిన్న తేడాలుంటాయంతే. ఇంగ్లీష్‌లో అయితే ‘రైజ్.. రోర్.. రివోల్ట్..’. తెలుగులో ‘రౌద్రం రుధిరం రణం’.
నీటికి వున్న శక్తి అంతా ఇంతా కాదు.. నిప్పు గురించిన కొత్తగా చెప్పేదేముంది.? ఆ రెండు శక్తుల్ని రాజమౌళి తెరపై ఇంకెంత శక్తిమంతంగా చూపబోతున్నాడోగానీ, మోషన్ పోస్టర్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇదేదో మోషన్ పోస్టర్‌లా కాకుండా, ప్రీ టీజర్‌లా అన్పించిందంటే అతిశయోక్తి కాదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏంటి.? ఆ గ్రాఫిక్స్ ఏంటి.? హాలీవుడ్ సినిమాల్ని తలపించేలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ని రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లుగా వుంది. ఇప్పటికే ‘బాహుబలి’తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, ఈసారి అంతకు మించి.. అనే స్థాయిలో సంచలనాన్ని సృష్టించబోతున్నాడు ‘ఆర్‌ఆర్‌ఆర్’తో. అవును, రాజమౌళికి మాత్రమే ఈ తరహా అద్భుతాలు సాధ్యమవుతాయేమో. ‘బాహుబలి రికార్డుల్ని తిరగారాయలంటే మళ్ళీ అది ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళికి మాత్రమే సాధ్యం.