ఆచార్యలో రామ్ చరణ్ నటించడం ఖాయమైపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ పోషించబోయే పాత్రేమిటన్నదీ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. చిరంజీవి - చరణ్ ఇద్దరూ నక్సలైట్లే. కానీ చరణ్ ఆలోచనలు వేరు, చిరు ఆలోచనలు వేరు. ఎవరి సిద్ధాంతాలు వాళ్లవి. అయితే.. చరణ్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణ త్యాగం చేయాల్సివస్తుంది. ఆ సమయంలో... చరణ్‌ని చూసి స్ఫూర్తి పొందుతాడు చిరంజీవి. అప్పటి నుంచీ ఈ కథ స్వరూపమే మారిపోతుంది. చరణ్ - చిరు ఇద్దరూ ఓ పాటలో కనిపిస్తారని, కొన్నియాక్షన్ ఎపిసోడ్లలోనూ పాలు పంచుకుంటారని తెలుస్తోంది. చరణ్ పాత్ర మొత్తంగా చూస్తే 30 నిమిషాల పాటు సాగుతుందని, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ వ్యవహారమని టాక్. ఈ 30 నిమిషాల ఎపిసోడ్ కోసం 30 రోజుల కాల్షీట్లు కేటాయించాల్సివస్తోందట. ఆ 30 రోజుల కోసం 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని టాక్. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చరణ్ పక్కన కూడా ఓ కథానాయిక ఉండే అవకాశం ఉంది. ఆమె ఎవరన్నది త్వరలో చెబుతారు.