ఈ సంక్రాంతి మామూలుగా ఉండబోవడం లేదు. నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ని ప్రేక్షకులకు ఇవ్వబోతోంది చిత్రసీమ. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఎఫ్ 2.. ఇలా చాలా సినిమాలు వరుసకడుతున్నాయి. ఇప్పుడు RRR కూడా రాబోతోందని మరో టాక్. జనవరి 7.8.9.. ఆ తేదీల్లో ఏదో ఓ దానికి RRR ఫిక్స్ కాబోతోంది. రాజమౌళి బృందం డేటు ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా పెద్ద సినిమాలున్నాయి. వాటిని RRR కూడా తోడైతే.. పండగ ఆనందం రెట్టింపు అవుతుంది. కాకపోఏత... బాక్సాఫీసు దగ్గరే అంత స్పేస్ లేదు.
RRR కానీ విడుదలైతే ఒకట్రెండు సినిమాలు వెనక్కి వెళ్లాల్సిందే. రాజమౌళి తన RRR డేట్ గనుక ప్రకటిస్తే - తాను వెనక్కి వెళ్లడానికి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నాడట. మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట`ని జనవరి 14న విడుదల చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వల్ల.. సర్కారు వారి పాట వెనక్కి వెళ్లబోతోంది. రాధే శ్యామ్ కూడా వాయిదా వేయాలని చూశారు. కానీ ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైంది. మరింత లేట్ అయితే ఈ సినిమాపై బ్యాడ్ ఇమేజ్ వచ్చి చేరిపోతుంది. అందుకే నిర్మాతలు ఆ ధైర్యం చేయడం లేదు.
ఈ సినిమాని మరోసారి వాయిదా వేయడం కంటే... RRR పై పోటీకి దించడమే బెటర్ అనుకుంటున్నారు. భీమ్లా నాయక్ పరిస్థితీ ఇంతే. ఈ సినిమా సంక్రాంతికే రాబోతోంది. ఎఫ్ 2 కూడా ఆలస్యమయ్యే ఛాన్సుంది. మొత్తానికి RRR కి భయపడుతోంది.. మహేష్ సినిమానే అన్నమాట.