'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' సినీ ప్రపంచమంతా ఒకే చోట!

By iQlikMovies - November 03, 2018 - 09:58 AM IST

మరిన్ని వార్తలు

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధమయ్యింది. అదే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'. ఇంకా టైటిల్‌ పెట్టలేదు గనుక, దీన్ని 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'గానే ప్రస్తుతానికి పరిగణించక తప్పదు. ఈ మూడు 'ఆర్‌'లలో ఒకటి రాజమౌళి, ఇంకోటి రామ్‌చరణ్‌, మరోటి ఎన్టీఆర్‌. దర్శ ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఇది. రామ్‌చరణ్‌ - జూ.ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఇది. 

గతంలో ఈ ఇద్దరితోనూ సినిమాలు చేసిన రాజమౌళి, ఈసారి ఇద్దర్నీ కలిపాడు. నందమూరి - మెగా కాంబినేషన్‌ ఈ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'. అప్పుడెప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్‌, చిరంజీవి ఓ సినిమాలో కన్పించారు. అయితే అప్పటికి చిరంజీవి ఇంకా 'పెద్ద స్టార్‌' అన్పించుకోలేదు. ఆ సంగతి పక్కన పెడితే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ వేడుక కోసం సినీ పరిశ్రమకు చెందిన అతిరధ మహారథులంతా హాజరు కాబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

'బాహుబలి'తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు ఈ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.'ని కూడా ఇండియన్‌ సినిమాగానే తెరకెక్కించే అవకాశం వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సో, అన్ని సినీ పరిశ్రమల నుంచీ ప్రముఖులు ఈ సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేయడం ఖాయం. వాళ్ళెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 'బాహుబలి'తో తెలుగు సినిమాని, బాలీవుడ్‌ రేంజ్‌ని దాటించేశాడు రాజమౌళి. 

మరిప్పుడు, రాజమౌళి టార్గెట్‌ హాలీవుడ్‌ అనుకోవాలా.? హాలీవుడ్‌ సినిమా తరహాలో ఈ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' వుండబోతోందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌ ఫర్‌ ది కంప్లీట్‌ అప్‌డేట్స్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS