'జీరో' ట్రైలర్‌: మరుగుజ్జు మొనగాడు

మరిన్ని వార్తలు

హైట్‌ చాలా తక్కువ.. అయితేనేం, ఆటిట్యూడ్‌లో ఎవరికీ తీసిపోడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను మరుగుజ్జు మొనగాడు. అందమైన అమ్మాయిని పెళ్ళాడేందుకు తనకు అన్ని అర్హతలూ వున్నాయని భావిస్తుంటాడు. అయితే అతని మరుగుజ్జు రూపం చూసి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రారు. వీల్‌ ఛెయిర్‌కే పరిమితమైన ఓ అమ్మాయిని, ఆ విషయం తెలియకుండానే ఓ ఫొటో చూసి ప్రేమించేస్తాడు. తాను ఇష్టపడ్డ అందమైన అమ్మాయి, వీల్‌ ఛెయిర్‌లోంచి కిందికి దిగలేదనీ, సరిగ్గా మాట్లాడలేదని తెలిసి ఆశ్చర్యపోతాడు. 

ఇంకోపక్క, లేడీ సూపర్‌ స్టార్‌ అనదగ్గ అందాల భామ ఈ మరుగుజ్జు గారికి ఏకంగా లిప్‌ టు లిప్‌ కిస్‌ ఇచ్చేస్తుంది. అంతే, మనోడి లుక్‌ అటువైపుకు తిరిగిపోతుంది. ఇదీ షారుక్‌ఖాన్‌ తాజా చిత్రం 'జీరో' ట్రైలర్‌ సారాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్‌ బ్లోయింగ్‌ ట్రైలర్‌ ఇది. ఇందులో ఫన్‌ వుంది, ఎమోషన్‌ వుంది.. గ్రాండియర్‌ వుంది. ఇంతకు మించి ఏ సినిమాకైనా ఇంకేం కావాలి? షారుక్‌ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ 'జీరో' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాంటిలాంటి సినిమా కాదు, చాలాకాలం క్రిందట కమల్‌హాసన్‌ చేసిన ప్రయోగం ఇన్నాళ్ళ తర్వాత షారుక్‌ చేస్తున్నాడు. 

మధ్యలో కొందరు కాస్సేపు మరుగుజ్జు పాత్రల్లో నటించినా, పూర్తిస్థాయిలో మరుగుజ్జు పాత్ర అంటే కమల్‌ తర్వాత షారుక్‌ అని చెప్పక తప్పదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ కలగలిపి తీసిన అద్భుతమైన సినిమాలా 'జీరో' ట్రైలర్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది. థియేటర్లలో ఈ 'జీరో' మరుగుజ్జు ఏం చేయబోతున్నాడో వేచి చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS