రాజమౌళి సినిమా టైటిల్ అదేనా?

మరిన్ని వార్తలు

స్టార్ డైరెక్టర్  రాజమౌళి తాను డైరెక్ట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన టైటిల్స్ ను సజెస్ట్ చేశారు.  అన్నిటినీ పరిశీలించిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి   'రామ రాజ రౌద్రం' అనే   టైటిల్ ను  బలంగా పరిశీలిస్తున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి.  ఈ పేరే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయట.  ఇక ఇతర భాషల విషయానికి వస్తే  'రైజ్ రివొల్ట్ రివెంజ్' అనే టైటిల్ పెడతారట. 

 

మరి ఈ టైటిల్స్ లో   ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.  ఈ సినిమాలో  ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.  'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  

  


కాగా  సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాను  వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు.  కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  'బాహుబలి' తరవాత   రాజమౌళి  చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS