కార్తికేయ - 2' హీరోయిన్ శృతి శర్మ కాదట!

మరిన్ని వార్తలు

యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో  యంగ్ హీరో నిఖిల్  హీరోగా  'కార్తికేయ - 2 ' చిత్రం  రూపొందనున్న సంగతి తెలిసిందే.  కాగా చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా  'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం  నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మను  ఫైనల్ చేయలేదట.

 

ఈ వార్తలు కేవలం రూమర్స్ అని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా హీరోయిన్ని వెతికే పనిలో ఉందట. ఇప్పటికే  పుర్తయిన  ఈ సినిమా  స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.    

 

 

ఎలాగు  'కార్తికేయ' సినిమాతోనే డైరెక్టర్ గా  మంచి డిమాండ్  తెచ్చుకున్న  చందు.. మళ్ళీ నిఖిల్ తో  'కార్తికేయ 2'  తీసి... తిరిగి  మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.  ఈ చిత్రాన్ని  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు.  అలాగే  ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS