`ఆర్‌.ఆర్‌.ఆర్‌` టీజ‌ర్ టాక్‌: కొమ‌రం భీమ్ గ‌ర్జ‌న ఇది!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ విశ్వ‌రూపాన్ని ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూసిన అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాజ‌మౌళి. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లోని కొమ‌రం భీమ్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేసి, ఈ టీజర్‌లో ఎన్టీఆర్ విజృంభ‌ణ‌నీ, విజువ‌ల్ గా తన క్రియేటివిటీని చూపించేశాడు రాజ‌మౌళి.

 

``వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌ నిల‌బ‌డితే.. సామ్రాజ్యాలు సాగిల ప‌డ‌తాయి వాడి పొగ‌రు.. ఎగ‌రే జెండా వాడి ధైర్యం చీక‌ట్లిని చీల్చే మండుటెండ‌ వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దు బిడ్డ‌ నా త‌మ్ముడు... గోండు బెబ్బులి కొమ‌రం భీమ్`` అనే రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ మొదలైంది. ప్ర‌తీ షాటూ.. విజువ‌ల్ ట్రీటే. ఎన్టీఆర్ కండ‌లు, తీక్ష‌ణ‌మైన చూపులు, అడ‌వుల్లో ప‌రుగులు.. ఇవ‌న్నీ ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేసేవే. చివ‌ర్లో కొమ‌రం భీమ్‌... ఓ ముస్లిం యువ‌కుడిగా మారిన వైనాన్ని చూపించాడు. ఎన్టీఆర్ మేకొవ‌ర్‌కి తోడు... రామ్ చ‌ర‌ణ్ వాయిస్ లోని ప‌వ‌ర్ ఈ టీజ‌ర్‌కి మ‌రింత బలాన్ని ఇచ్చాయి. ఎప్ప‌టిలానే విజువ‌ల్స్‌, ఆర్‌.ఆర్‌, ఎడిటింగ్.. ఈ విష‌యాల్లో అంత‌ర్జాతీయ నైపుణ్యం క‌నిపించింది. మొత్తానికి ఈ ద‌స‌రాకి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాజ‌మౌళి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS