రాజమౌళి సినిమా కి రికార్డు దక్కకపోతే.. ఇంకేం సినిమాకి దక్కుతుంది..? మామూలు సినిమాలు తీశాడా.. ఆయన. రాజమౌళి సినిమా అంటే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవొచ్చు. అంత నమ్మకం కలిగించాడు. అందుకే.. బయ్యర్లు ఆయన సినిమాల్ని రికార్డు రేటు ఇచ్చి కొంటుంటారు. అందుకే రాజమౌళి సినిమాలు గత రికార్డుల్ని అలవోకగా బద్దలు కొట్టేస్తుంటాయి. `ఆర్.ఆర్.ఆర్` రికార్డుల ప్రస్థానం ఎప్పుడో మొదలైపోయింది.
అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేస్తాం అని ప్రకటించగానే.. బయ్యర్లు ఎగబడడం మొదలెట్టారు. ఇది వరకే చాలా ఏరియాల్లో డీలింగ్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఓవర్సీస్ డీల్ కూడా అయిపోయినట్టు తెలుస్తోది. ఓవర్సీస్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి దాదాపుగా 70 కోట్లు వచ్చాయట. ఇది సౌత్ ఇండియా రికార్డు. ఇది వరకు రోబో 2 కి 48 కోట్లు దక్కాయి. దాంతో పోలిస్తే... 22 కోట్లు ఎక్కువే అని చెప్పాలి. దాదాపు అన్ని ఏరియాల నుంచీ రికార్డు రేట్లే పలుకుతున్నాయి. వాటన్నింటిపై ఓ క్లారిటీ రావాల్సివుంది.