ఈ యేడాదిలోనే అతి పెద్ద సినిమా.. పుష్ఫ. బడ్జెట్ పరంగా, క్రేజ్ పరంగా.. 2021లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే. 2022 అయితే...ఆ స్థానాన్ని ఆర్.ఆర్.ఆర్ కైవసం చేసుకుంది. తెలుగు సినిమాని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రాలుగా.. ఈ రెండింటి గురించీ చెప్పుకుంటున్నారు. వీటి ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున చేయాలన్నది ప్లాన్. అందుకోసం దుబాయ్ పై కన్నేశారు. దుబాయ్‌లో ఓ భారీ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాలని పుష్ప భావించింది. అందుకోసం కసరత్తులు కూడా చేసింది. అదే బాటలో ఆర్.ఆర్.ఆర్ కూడా వెళ్లింది.
దుబాయ్ లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి, మరోసాది దేశం అంతా తమ సినిమావైపు తిరిగి చూసేలా చేయాలనుకుంది. దాంతో... టాలీవుడ్ కేరాఫ్ దుబాయ్ అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ మారిపోయింది. దుబాయ్‌లో ఈ సినిమా ఈవెంట్లు జరగడం లేదు. ఆ ప్రయత్నాన్ని రెండు చిత్రబృందాలూ వాయిదా వేశాయి. ప్రమోషన్లకు దేశం దాటే ఆలోచన లేదని తెలుస్తోంది. దానికి కారణం.. సమయాభావమే. పుష్ఫ డిసెంబరు 17న రాబోతోంది. ఎంతో టైమ్ లేదు. ఈలోపు సినిమా పూర్తవ్వాలి. ఆ తరవాత.. దేశంలో ప్రమోషన్లు నిర్వహించాలి. ఇదంతా చేయడానికే టైమ్ లేదు. మధ్యలో దుబాయ్ షెడ్యూల్ కూడా పెట్టుకుంటే, న్యాయం చేయడం కష్టమని పుష్ప టీమ్ భావిస్తోంది. అందుకే దుబాయ్ ప్లాన్ కాన్సిల్ చేసింది. అదే బాటలో ఆర్.ఆర్.ఆర్ కూడా నడుస్తోంది. దుబాయ్‌లో.. ప్రస్తుతం తెలుగు సినిమాకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లూ లేనట్టే.