అక్టోబరు 13న RRR రిలీజ్ అవుతుందని చిత్రబృందం పదేపదే చెబుతోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లలో, మేకింగ్ వీడియోలోనూ.. రిలీజ్ డేట్ అక్టోబరు 13నే అని పక్కాగా ప్రకటించింది. అయితే అక్టోబరు 13న ఈసినిమా రావడం కష్టమని, ఇప్పటికీ ఈ సినిమా వర్క్ చాలా వరకూ పెండింగ్ లో ఉందని, అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేయడం కష్టమే అని రాజమౌళికీ తెలుసని... ఇన్ సైడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
నిజానికి లాక్ డౌన్ కారణంగా సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సెకండ్ వేవ్ కి ముందే RRR రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. అక్టోబరు 13న ఈ సినిమా రాదని, మరోసారి వాయిదా పడుతుందని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజమౌళి చెప్పిన మాట మీదే నిలబడ్డాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, అందుకే అక్టోబరు 13న వస్తుందని నిర్మాత కూడా చెప్పారు. కానీ... ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉందని, అది అయ్యే వరకూ పబ్లిసిటీ మొదలు కాదని, ఈ సినిమాకి కనీసం రెండు నెలల పాటు పబ్లిసిటీ చేయాలని, లేకపోతే.. కష్టమని రాజమౌళి భావిస్తున్నాడట. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో.. పెన్ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. కేవలం ఆ సంస్థ ఒత్తిడి మేరకు.. రిలీజ్‌డేట్ ని ప్రకటించారు తప్ప, అప్పటికి సినిమా సిద్ధం కాదన్నది ఫిల్మ్‌నగర్ టాక్.
అన్నింటికంటే ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరు తేదీల్లో.... కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉంటుందని, ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదల చేయడం కష్టంగా మారుతుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. సో,... అక్టోబరు 13న ఈ సినిమా రాకపోవొచ్చని టాక్.