అప్పుడు 5 కోట్లు.. ఇప్పుడు 50 కోట్లు

By Gowthami - January 25, 2021 - 12:16 PM IST

మరిన్ని వార్తలు

దేశ‌మంతా ఎదురు చూస్తున్న సినిమాల్లో `కేజీఎఫ్ 2` ఒక‌టి. కేజీఎఫ్ వ‌చ్చిన‌ప్పుడు ఆ సినిమాని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.కానీ.. సైలెంట్ గా విడుద‌లై.. సంచ‌ల‌నాలు సృష్టించింది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ 2 అలా కాదు. ఈ సినిమాపై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. సినిమా మొద‌ల‌వ్వ‌కుండానే.. అడ్వాన్సులు ఇచ్చి ఏరియాల రైట్స్ కొనుక్కున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకి పిచ్చ డిమాండ్ ఏర్ప‌డింది.

 

కేజీఎఫ్ ని తెలుగులో కొన‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. అయితే.. నిర్మాతలు సాయి కొర్ర‌పాటిని సంప్ర‌దించి 5 కోట్ల‌కే ఈ సినిమా బ‌ల‌వంతంగా క‌ట్ట‌బెట్టారు. అయితే 5 కి 5 మొత్తం 10 కోట్లు తెచ్చుకుంది సినిమా. అయితే కేజీఎఫ్ 2కి మాత్రం అదిరిపోయే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాని 50 కోట్ల‌కు కొనుగోలు చేయ‌డానికి టాలీవుడ్ లోని ఓ ప్ర‌ముఖ నిర్మాత రెడీ అయిపోయిన‌ట్టు టాక్‌. అయితే... సాయి కొర్ర‌పాటి ఈ సినిమా మాకే కావాలి అని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట‌. ఆయ‌న 50 కోట్ల‌కు కొనుక్కుంటే ఈ సినిమాని ఆయ‌న‌నే ఇవ్వాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. మ‌రి సాయి కొర్ర‌పాటి అంత‌కు కొనుక్కోగ‌ల‌డా? లేదా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దానికంటే ఎక్కువ‌గా ఎవ‌రు ఆఫ‌ర్ చేసినా వాళ్ల‌కు కేజీఎఫ్ 2 వెళ్లిపోతుంది. ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS