బల్గేరియాలో 'యాక్షన్‌'కి సై అంటోన్న 'కొమరం భీమ్‌'.

By iQlikMovies - August 24, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ప్రస్తుతం బల్గేరియాలో సందడి చేస్తోంది. అక్కడ ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారట. అందుకోసం మూడు నుండి నాలుగు వారాలపాటు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ అక్కడే ఉండనుందట. అయితే, ఈ షెడ్యూల్‌ని కేవలం ఎన్టీఆర్‌ మీదే ప్లాన్‌ చేశారట. చరణ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో యంగ్‌ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 

కొమరం భీమ్‌పై చిత్రీకరించే ఈ యాక్షన్‌ సీన్‌ సినిమాలోని వన్‌ ఆఫ్‌ ది హైలెట్‌ సీన్‌ కానుందట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో జోడీ కట్టబోయే విదేశీ భామ కూడా పాల్గొననుందనీ తెలుస్తోంది. ఎమ్మా రాబర్ట్స్‌ అనే విదేశీ ముద్దుగుమ్మని ఎన్టీఆర్‌ కోసం జోడీగా ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతవరకూ ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీన్‌తో పాటు, ఎన్టీఆర్‌కీ, ఆయన హీరోయిన్‌కీ మధ్య అత్యంత కీలకమైన రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరణ కూడా జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆల్రెడీ ఎన్టీఆర్‌ అండ్‌ టీమ్‌ బల్గేరియా చేరుకున్నారట. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS