నేనేం అంత హాటు కాదంటోన్న ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

'చిలసౌ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్యూటీ రుహానీ శర్మ హీరోయిన్‌గా మంచి గుర్తింపునే అందుకుంది. అయితే ఈ సినిమాలో అమ్మడిని చూసిన వారంతా ఈ ముద్దుగుమ్మ సాయిపల్లవి, నిత్యామీనన్‌ తదితర ముద్దుగుమ్మల్లా గ్లామర్‌కి దూరమేమో అనుకున్నారు. సినిమాలో అలాగే నటించింది మరి. 

విత్‌ అవుట్‌ గ్లామర్‌ నేచురల్‌ లుక్‌లో అక్కడక్కడా పింపుల్స్‌ కూడా హైలైట్‌ అయ్యేలా ఉంది ఆమె మోము. అయితే సినిమా విడుదలయ్యాక అమ్మడు గ్లామర్‌ కంచె తెంచేసింది. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయి, ఆ పెళ్లికూతురు వేరు. ఈ హాట్‌కూతురు వేరు అనే రేంజ్‌లో బిల్డప్‌ ఇచ్చేసింది. ఆ పిక్స్‌ చూసిన వారంతా అవును నిజమే రుహానీలో చాలా హాట్‌నెస్‌ దాగుందిలే అనుకునేంతలోనే ప్లేటు మార్చేసింది. 

నేనేం అంత హాటు కాదంటోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తా. సిట్యువేషనల్‌గా గ్లామర్‌ పండిస్తా. అంతకు మించి హాట్‌నెస్‌కి నో అనేలా మాట్లాడుతోంది. ఈ మాటలకు పిక్స్‌ అయ్యేలోగా మరోసారి ఈ ముద్దుగుమ్మ మాట మార్చేసింది. అంతేలెండి ముద్దుగుమ్మల మాటలకు అర్ధాలే వేరనుకోవాలి. ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కే కాదు, నాలో అన్ని యాంగిల్స్‌ ఉన్నాయి. అన్ని రకాల యాంగిల్స్‌కీ నేను సూటవుతాను అనేలా సంకేతాలు పంపిస్తోంది. అసలింతకీ ఈ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకునేదెలా.! 

చూద్దాం అమ్మడు అందుకున్న తర్వాతి ఛాన్స్‌ని బట్టి మనమే ఓ ఐడియాకొచ్చేద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS