నూతన్-దీప్తి మధ్య గొడవకి కారణమేమిటి?

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2వ సీజన్ దాదాపుగా 10వ వారంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఇంటిలోని సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

దీనికి తాజా ఉదాహరణగా నూతన్ నాయుడు-దీప్తి నల్లమోతు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం వింటుంటే మనకే అర్ధమవుతుంది. అయితే వారి మధ్య జరుగుతున్న సంబాషణలో ఎక్కువ శాతం దీప్తి ప్రవర్తిస్తున్న తీరుని నూతన్ నాయుడు ప్రశ్నిస్తున్నధోరణి మనకి అర్ధమవుతుంది.

అయితే వీరిరువురి మధ్య అసలేం జరిగింది? ఈ గొడవకి కారణమేంటి? అనే దాని పైన సరైన అవగాహన లేకున్నా దీప్తి ప్రవర్తననే.. నూతన్ ముఖ్యంగా టార్గెట్ చేస్తుండడంతో ఆమె ప్రవర్తన కారణంగానే ఇదంతా జరుగుతున్నది అని మనం అనుకోవచ్చు.

కొసమెరుపు ఏంటంటే- నిన్నటి ఎలిమినేషన్ ప్రక్రియలో నూతన్ తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుని దీప్తిని సేఫ్ చేశాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS