గ్లామ్‌షాట్‌: 'స్పైసీ' రౌడీ గెటప్‌లో 'హాట్‌' పెళ్లి కూతురు!

మరిన్ని వార్తలు

'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. తొలి సినిమాతో మంచి హిట్‌ కొట్టింది. పెద్ద అందగత్తె అని చెప్పలేం కానీ, నేచురల్‌ గ్లామర్‌తోనే ఆ సినిమాలో కనిపించింది. అయితే, అమ్మడు ఆ సినిమాలో కనిపించినంత నేచురల్‌ అండ్‌ హోమ్లీ ఏమీ కాదండోయ్‌. అమ్మడి ఇన్‌స్టా టాలెంట్‌ చూస్తే, అవాక్కవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో అమ్మడి హాట్‌ పోజులుంటాయి మరి. తాజాగా మన పెళ్లికూతురు ఓ హాట్‌ కాస్ట్యూమ్‌లో స్పైసీ పోజిచ్చిన ఫోటో ఒకటి నెట్టింట్లో షేర్‌ చేసింది.

 

లేడీ రౌడీలా కనిపిస్తున్న ఈ పిక్‌లో ఆమె ఎక్స్‌పోజింగ్‌ చూసి నెటిజన్స్‌కి షాక్‌ అవ్వడమే తమ వంతయ్యింది. కొంచెం ఖాకీకి దగ్గరలో ఉండే కలర్‌లో ప్యాంట్‌ షర్టు ధరించింది. ప్యాంట్‌కి బెల్టు పెట్టలేదు. షర్ట్‌కి బటన్స్‌ పెట్టలేదు. పింక్‌ కలర్‌ ఇన్నర్‌ ధరించింది. అందులోంచి అందాలన్నీ వదిలేసింది. సో అలా స్పైసీ క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ, రెండు చేతులూ ప్యాంట్‌ పాకెట్‌లో పెట్టి, జుట్టు మొత్తం టైట్‌గా ముడి పెట్టి, అచ్చు లేడీ రౌడీలా కిలాడీ హాట్‌ పోజిచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఏమంత బిజీగా లేదు. కానీ, అవసరం అనుకుంటే, మన దర్శక, నిర్మాతలు పాపని వాడుకోవచ్చు. నో డౌట్‌ ఆల్‌ టాలెంట్స్‌ ఉన్నాయి అమ్మడిలో మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS