గ్లామ్‌ షాట్‌: రుక్సార్‌

By iQlikMovies - October 12, 2018 - 16:55 PM IST

మరిన్ని వార్తలు

డాన్స్‌ స్టూడియోలో అందాలు చిందిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నాని సరసన అనుపమ కాకుండా మరో హీరోయిన్‌ నటించింది కదా, ఆ బ్యూటీనే. ఆదిల్‌ డాన్స్‌ అకాడమీలో డాన్స్‌ క్లాసులు తీసుకుంటోన్న ఈ బ్యూటీ, ఆ సమయంలో ఇదిగో ఇలా ఓ సెల్ఫీకి పోజిచ్చి, ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. చక్కనమ్మ చిక్కితే అందమే.. అదే సమయంలో, కాస్త బొద్దుగా వున్నా బ్యూటీనే. బక్క చిక్కిపోయి కాకుండా, మరీ బొద్దుగా కాకుండా.. పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌తో రుక్సార్‌ మీర్‌ కన్పిస్తుంటుంది ఎప్పుడూ. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎబిసిడి' సినిమాలో నటిస్తోంది. అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. 'ఎబిసిడి' అంటే, అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ. ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అవుతుందనీ, హీరోయిన్‌గా తన రేంజ్‌ పెంచుతుందని రుక్సార్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. అన్నట్టు, ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. అందాల భామ రుక్సార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా మరి.? హ్యాపీ బర్త్‌ డే టు రుక్సార్‌ మీర్‌ థిల్లాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS