యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత'కి తొలి రోజు భారీ వసూళ్ళే లభించాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్లు మొదలైన కాస్సేపటికే, సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అభిమానులు డిక్లేర్ చేసేసుకున్నారు.
ఇండియాలో ఉదయం ఆట పూర్తయ్యేసరికి, ట్రేడ్ పండితులూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు ఓ అంచనాకి వచ్చారు. విజయదశమి సీజన్ కావడంతో.. ఇంకో వారం రోజులపాటు సినిమా థియేటర్లలో సందడి చేయడం ఖాయం. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు షోలు సినిమాకి ప్లస్ కాబోతున్నాయి. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ఒక్కటి చాలు, సినిమాని 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చేయడం.. అన్నది మెజార్టీ అభిప్రాయం.
అక్టోబర్ 18న 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రాబోతోంది. అయితే అది, 'అరవింద సమేత'కి పోటీ సినిమా ఏమాత్రం కాదు. ఆ జోనర్ వేరే. 'అరవింద జోనర్' వేరే. అమెరికాలో ఇప్పటికే 'అరవింద సమేత' 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లాంగ్ రన్‌లో సినిమా 2.5 మిలియన్లను సాధిస్తుందని తొలి రోజు అంచనా వేయగా, రెండో రోజుకి ఆ అంచనాలు మారాయి. 2.75 మిలియన్లను కూడా దాటేయొచ్చని అంటున్నారు. వీకెండ్ ముగిస్తే తప్ప, 'అరవింద సమేత' వసూళ్ళపై పూర్తి స్పష్టత రాబోదు.
యంగ్ టైగర్‌కి మాస్ ఆడియన్స్‌లో వున్న క్రేజ్ నేపథ్యంలో, ఈ రోజు వర్కింగ్ డే అయినా హౌస్ ఫుల్ బుకింగ్స్ అన్ని చోట్లా కన్పిస్తున్నాయి. నైజాం, రాయలసీమల్లో ఫస్ట్ డే సందడి రెండో రోజు కూడా కన్పిస్తోంది. మిగతా ఏరియాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి.
ఏదిఏమైనా, 100 కోట్ల క్లబ్‌లోకి 'అరవింద సమేత' చేరడం కేక్ వాక్ కిందనే భావించాలి. అద్భుతం జరిగితే, ఈ సినిమా 125 కోట్ల క్లబ్‌లోకి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.