'రూలర్' కోసం బాలయ్య చాలా కష్టపడ్డాడు అన్నదానికి ఆయన యంగ్ లుక్సే కారణంగా చెప్పొచ్చు. ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న పోస్టర్స్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తున్నాయి. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ రెండు లుక్స్‌నీ పరిచయం చేసేశారు. వాటిలో ఓ లుక్ కోసం చాలా బరువు తగ్గి స్లిమ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న బాలయ్య, ఈ లుక్స్‌తో యూత్‌ని తెగ ఇంప్రెస్ చేసేస్తున్నారు. ఇంత సన్నగా బాలయ్య ఎప్పుడు మారిపోయారా.? అనేంతలా ఉన్నాయి ఈ లుక్స్. ఫ్రెంచ్ కట్ గెడ్డంతో, స్లిమ్‌గా, డిఫరెంట్ డిఫరెంట్ బ్లేజర్స్ ధరించి, స్టైలిష్ అండ్ రిచ్ లుక్స్‌లో కనిపిస్తున్నారు.
ఫ్యాన్స్‌కి షాకిచ్చేలా మరో పోస్టర్ రిలీజ్ చేసింది 'రూలర్' టీమ్. ఈ లుక్‌లో బాలయ్య తలపై టోపీ, కళ్లకు గాగుల్స్ ధరించి ప్లెజెంట్‌గా గోల్ఫ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక లుక్స్‌తోనే క్రేజ్ తెచ్చిన 'రూలర్' టీజర్ త్వరలో విడుదల కానుందట. అంతకన్నా ముందే హీరోయిన్స్ లుక్స్‌నీ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు 105వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సి.కళ్యాణ్‌తో కలిసి, బాలయ్య స్వయంగా నిర్మిస్తున్నారు. డిశంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.