బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా షూటింగ్‌లో గాయపడిందట. మెడకు చిన్నపాటి గాయమైందట. వైద్యులు చికిత్స చేసి, మెడకు బ్యాండేజీ వేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ, పరిణీతి ఓ ఫోటో పోస్ట్ చేసింది. బ్యాక్ సైడ్ నుండి తన మెడకున్న బ్యాండేజీని చూపిస్తున్న ఫోటో అది. ప్రస్తుతం పరిణీతి చోప్రా భారత టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లోనే పరిణీతి గాయపడింది. చిన్నపాటి గాయమే కానీ, కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారట వైద్యులు.
సో విశ్రాంతి అనంతరం మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని ఈ ఫోటో ద్వారా పరిణీతి చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ, ఈ పిక్ చూసిన నెటిజన్లు కొందరు అయ్యో పరిణీతి గాయపడిందా.? అని సానుభూతి చూపిస్తుంటే, ఇంకొందరు, ఈ చిన్నపాటి గాయానికి ఈ స్థాయిలో పబ్లిసిటీ అవసరమా బేబీ.. అది కూడా అదేదో గ్లామర్ ఎగ్జిబిషన్ కోసం దిగిన ఫోటో షూట్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవును నిజమే, నెట్టెడ్ బ్రా ధరించి, బ్రైట్ బ్రౌన్ కలర్ లెగ్గిన్‌లో బ్యాక్ వ్యూలో దిగిన ఫోటో ఇది.
మెడకు వేసిన బ్యాండేజీ కూడా బ్లూ కలర్‌లో బ్రైట్‌గా కనిపిస్తోంది. సో క్యాజువల్‌గానే దిగినా, కానీ, ఈ ఫోటో చూస్తే ఎవరికైనా అలా అనిపించడంలో తప్పేం లేదు. అయినా, ఈ రోజుల్లో పెళ్లయినా, చావైనా పబ్లిసిటీనే అన్నట్లుగా, సంతోషాన్నీ, బాధనీ నెట్టంట్లో ఈక్వెల్‌గా పంచేసుకుంటున్నారిలా.