నందమూరి నట సింహం బాలయ్య బాబు ప్రస్తుతం సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చేవారంతో ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అవుతాయట. ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. అయితే వేదిక మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.
అలాగే ఓ కీలకమైన పాత్రలో నమిత కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్ టైన్‌మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా కోసం ముఖ్యంగా సినిమాలోని తన రెండు గెటప్ ల్లో బాగా యంగ్ లుక్ లో కనిపించడానికి.. బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేసారు.
ఈ వయసులో కూడా బాలయ్య ఆ రేంజ్ లో కష్టపడటం నిజంగా గ్రేటే. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్యలుక్ ను రివీల్ చేసిన పోస్టర్స్ కు కూడా ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే మొన్న రిలీజ్ అయిన టీజర్ కూడా బాగా ఆదరణ పొందింది. మొత్తానికి బాలయ్య మళ్లీ పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బాలయ్యకు ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.