వైజాగ్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న `రూల‌ర్` ప్రీ రిలీజ్ ఈవెంట్

మరిన్ని వార్తలు

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న వైజాగ్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌లో ఎంటైర్ చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు.

 

ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్, టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. `జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ సంగీతాన్ని, రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS