మొత్తానికి శర్వానంద్ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళ హిట్ చిత్రం '96' తెలుగు రీమేక్ చిత్రంతో పాటు తరువాత చేయబోయే సినిమా స్క్రిప్ట్ తో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. జనవరి ఎండింగ్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలు అవ్వగానే మరో కొత్త సినిమా మొదలయ్యేలా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శర్వానంద్. పైగా అది తెలుగు సినిమా కూడా కాదు.. డైరెక్ట్ తమిళ చిత్రం చెయ్యబోతున్నాడు.
ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్ట్ చేయనున్నాడు. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా అన్ని అంశాలు అనుకూలించడంతో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్రం తెలుగులో డబ్ కానుంది. మరి శర్వానంద్ కి తమిళంలో హిట్ వస్తోందేమో చూడాలి. ఇప్పటికే గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా 'ఎంగేయుమ్ ఇప్పోతుమ్' (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ నటించాడు. మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై తమిళ్ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంది. మరి శర్వానంద్ కి హిట్ వస్తోందో లేదో చూడాలి. గత చిత్రం రణరంగం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో శర్వాకి ఈ సినిమా చేస్తోన్న సినిమాలు కీలకం కానున్నాయి.