'రూలర్' కోసం బాలయ్య చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది. ఆయన మేకోవర్‌కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొంచెం బొద్దుగా కనిపించే బాలయ్య, ఈ సినిమాలో చాలా సన్నగా టీనేజ్ కుర్రోడిలా కనిపిస్తున్నారు. ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్‌లో ఒక్కోటి ఒక్కో రకంగా ఆకట్టుకుంటే, తాజా పోస్టర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేయడమే కాక, అసలు ఇది బాలయ్యకు ఎన్నో సినిమా అబ్బా.. ఇప్పుడు బాలయ్య వయసు ఎంతబ్బా.? అనేంతలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫుల్ జోష్ మోడ్‌లో రొమాంటిక్ లుక్స్‌లో కేక పుట్టిస్తున్నాడు బాలయ్య. తప్పేం లేదు.. ఇద్దరు భామలతో బాలయ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం అనిపించక మానదు ఈ లుక్స్ చూస్తుంటే, ఈ సినిమాలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో బాలయ్య కనిపించనున్నారు. బహుశా ఇంతవరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ఒక వెర్షన్ గెటప్‌కి చెందినవే. తెలియని ఇంకో గెటప్ కూడా ఉంది.
త్వరలోనే ఆ గెటప్‌నీ రివీల్ చేయనున్నారట. దాంతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి కూడా చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. టీజర్‌ని చాలా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారట. డిశంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మాతగా సినిమా తెరకెక్కుతోంది.