టీజర్‌ టాక్‌: 'రూలర్‌' వేట మొదలెట్టేశాడు.!

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం 'రూలర్‌' టీజర్‌ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ విడుదల చేసిన పోస్టర్స్‌ అన్నీ స్టైలిష్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నాయి. టీజర్‌నీ అంతే స్టైలిష్‌గా డిజైన్‌ చేశారు. రిచ్‌ విజువల్స్‌తో టీజర్‌ని కట్‌ చేశారు. పోస్టర్స్‌లో చూపించినట్లుగానే బాలయ్య లుక్స్‌ అంతే స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్నాయి. 'ధర్మ మా గ్రామ దైవం.. ఎవరికి కష్టమొచ్చినా ఆయన ముందుండి మమ్మల్ని కాపాడుతుంటాడు..' అనే లేడీ వాయిస్‌తో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత 'ఒంటి మీద యూనిఫామ్‌ ఉంటేనే కామ్‌గా ఉంటా. యూనిఫామ్‌ తీస్తే ఇక వేటాడేస్తా..' అంటూ బాలయ్య ఏజ్‌ యూజ్‌వల్‌ తనదైన శైలిలో డైలాగులు ఇరగదీసేశారు.

ఆ తర్వాత ఫారెన్‌ లొకేషన్స్‌, అమ్మాయిలు, అందాల ఆరబోతలు.. ఓ రేంజ్‌లో చూపించారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అందాల భామలు వేదిక, సోనాల్‌ చౌహాన్‌ పోటీ పడి అందాలారేసినట్లు టీజర్‌లో చూపించారు. మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్‌ ద్వారా చూపించారు. డిశంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న 'రూలర్‌' ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS