బన్నీని రాహుల్‌ ఈ సారి మిస్‌ కాలేదుగా.!

By Inkmantra - November 21, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

'రాములో రాములా..' పాట మిస్సయ్యానంటూ రాహుల్‌ సిప్లిగంజ్‌ చాలా ఫీలయ్యాడు. కానీ, ఈ సారి మిస్‌ కాలేదు. బన్నీ నటించిన 'అల వైకుంఠపురములో..' నుండి మూడో పాట 'ఓఎమ్‌జీ డాడీ..' సాంగ్‌ని రాహుల్‌ సిప్లిగంజ్‌తోనే పాడించాడు తమన్‌. కృష్ణ చైతన్య మ్యూజిక్‌లో రూపొందిన ఈ సాంగ్‌ని బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. రాహుల్‌తో పాటు, గత బిగ్‌బాస్‌ సీజన్‌ కంటెస్టెంట్‌ అయిన రోల్‌ రైడా, రాహుల్‌ నంబియార్‌ తదితరులు గొంత కలిపారు. చిల్డ్రన్స్‌ డే స్పెషల్‌గా అల్లు అర్జున్‌ పిల్లలు అయాన్‌, అర్హ ఈ పాటలో కనిపించి సందడి చేశారు.

 

రేపు అనగా శుక్రవారం ఈ పాటకు సంబంధించి ఫుల్‌ వీడియో సింగిల్‌ని రిలీజ్‌ చేయనుంది 'అల..' టీమ్‌. ఇంతవరకూ రిలీజ్‌ అయిన 'అల..' సాంగ్స్‌ అన్నీ డిఫరెంట్‌ పంథాలో విడుదల చేశారు. ఆ క్రమంలో ఈ సాంగ్‌ వీడియోని ఎలా డిజైన్‌ చేశారో అంటూ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇదే రోజు మహేష్‌ 'సరిలేరు..' టీజర్‌ కూడా రిలీజ్‌ అవుతుండడంతో, అందుకు ఏమాత్రం తక్కువ కాకుండా అంతకు మించి అనే రేంజ్‌లో ఈ సాంగ్‌ వీడియో ఉండేలా 'అల..' టీమ్‌ జాగ్రత్త పడింది. తొలి రెండు సాంగ్స్‌తో సెన్సేషనల్‌ సృష్టించిన బన్నీ ఈ సారి ఎలా మెస్మరైజ్‌ చేయనున్నాడో, చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS